Wednesday 30 March 2016

వివరాలకు సంప్రదించండి


contact autharity for enqueiry

  •  వివరాలకు సంప్రదించండి 
  •  
  • Reception Land line: 08685 236623
    Asst.Executive officer (Reception): 8333994006
    Superintendent (Reception): 8333994013
    Superintendent (Reception): 8333994014
  • Temple:
    Temple Land line: 08685 236622
    Asst.Executive off (temple): 8333994005
    Superintendent (Temple): 8333994015
    Superintendent (Temple): 8333994016
  • Administration:
    Admin off.Landline: 08685 236645
    Executive Officer Landline: 08685 236755
    Asst.Executive officer: 8333994007
    Superident (Admin): 8333994008
    Pathagutta temple superindent: 8333994020
  • Engineering Wise:
    Executive Engineer: 08333994001
    Dy.E.E: 08333994002
    A.EE.: 08333994004

Thursday 24 March 2016

ఆలయ పురాణం

ఆలయ పురాణం              

 

 
Image result for yadagirigutta temple   

 ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో ల క్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.

రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.
చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.
మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.

రవాణా సౌకర్యాలు


రవాణా సౌకర్యాలు


రాయ్ గిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండ లనుండి చాలా బస్సులు కలవు.  మ రి యు ఆఠో లు ఉండును


Image result for BUS       Image result for TRAIN

Image result for AUTO
YADHADRI.BLOGSPOT,COM





శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము,యాదగిరిగుట్ట ,నల్లగొండజిల్లా

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము


శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము నల్లగొండజిల్లా, యాదగిరిగుట్ట మండలములో మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇది తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి.
My Facebook